సీఏఏను వ్యతిరేకించండి : బాలీవుడ్‌ ప్రముఖ నటి

జైపూర్‌ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల్లో మరో ప్రముఖ నటి చేరారు. ప్రజా వ్యతిరేకమైన సీఏఏను స్వాగతించేది లేదంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటి, దర్మకురాలు నందితా దాస్‌ స్పష్టం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సామాన్య ప్రజల పోరాటాన్ని ఆమె ప్రశంసించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనల్లో ఎలాంటి రాజకీయ పార్టీలు పాల్గొనడంలేదని, పోరాటాలు స్వచ్ఛందంగా జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. గురువారం జైపూర్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్ (జెఎల్ఎఫ్)లో నందితా దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా షాహీన్ బాగ్ వంటి మరిన్నో ప్రదేశాలు ఏర్పడబోతున్నాయని ఆమె జోస్యం చెప్పారు.